: ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సంపాదనే లక్ష్యమని ఎంపీ వివేక్ ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డదారిలో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారని, ఇటీవలి కాలంలో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్స్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీవోఎంకు కిరణ్ తప్పుడు నివేదికలు పంపారని, ఆయనకు ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.