: కోస్తాంధ్ర, రాయలసీమకు వర్షాలు


నైరుతీ బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం క్రమంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఇది ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, నాగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 620 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్యదిశగా పయనించి రేపు సాయంత్రానికి తమిళనాడులోని నాగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల ఈ రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ సాయంత్రం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. కాగా రాష్ట్రంలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News