: పోలీసులు నడుపుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు
సమాజంలోని అరాచకాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అరాచకాలకు పాల్పడుతున్నారు. వ్యభిచార గృహాలపై దాడి చేసి కేసులు నమోదు చేయాల్సిన పోలీసులే వ్యభిచార గృహాన్ని నడపడం కలకలం రేపగా, దాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేయడాన్ని నగర వాసులు అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ బంజారాహిల్స్ పరిథిలోని కమలాపురి కాలనీలో ఓ వ్యభిచారముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.
సుబ్బారెడ్డి, కృష్ణ అనే ఎపీఎస్పీ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు సురేష్ అనే వ్యక్తితో కలిసి ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఐదుగురు యువతులు, నలుగురు యువకులు ఉండగా వారిని బంజారాహిల్స్ పీఎస్ కు తరలించి కేసు నమోదు చేశారు.