: బర్డ్‌ఫ్లూకు కొత్తమందు
బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి పలు ఔషధాలను తయారుచేస్తున్నా ఏటా పెద్ద సంఖ్యలో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. ఈ వ్యాధి కారక వైరస్‌ను అడ్డుకోవడానికి కొత్త మందులను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బర్డ్‌ఫ్లూ వ్యాధికారక వైరస్‌ను అడ్డుకోవడానికి నోవార్టిస్, నోవావాక్స్ కంపెనీలు రూపొందించిన ప్రత్యేకమైన టీకాలు ప్రయోగపరీక్షలో మంచి ఫలితాలను ఇచ్చాయి. ఈ వ్యాధి కారక వైరస్‌ను ఎదుర్కొనడంలో గతంలో రూపొందించిన టీకాలు విఫలమైనందున ఇప్పుడు రూపొందించిన టీకా ఈ వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొనగలిగిందని, ఇది నిజంగా గొప్ప ముందడుగుగా భావిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.