: ఆస్తమా ఉందా... అయితే జాగ్రత్త
కొందరికి చిన్న వయసులోనే ఆస్తమా వేధిస్తుంటుంది. ఇలాంటి వారిలో ముఖ్యంగా మహిళల్లో ఆస్తమా వ్యాధి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే ఆస్తమా రోగులకు గర్భధారణ ఆలస్యం అవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
బిస్‌పెబ్‌జెర్గ్ యూనివర్సిటీ ఆసుపత్రి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆస్తమా ఉన్న మహిళల్లో గర్భధారణ ఆలస్యంగా అవుతుందని తేలింది. తమ పరిశోధనలో భాగంగా అధ్యయనవేత్తలు డెన్మార్క్‌లోని 15 వేలమంది కవలలను ప్రశ్నించి, వారి సమాధానాలను విశ్లేషించారు. తమ పరిశోధనలో పాల్గొన్న మహిళల్లో ఆస్తమా ఉన్న మహిళలను, లేని మహిళలను రెండు గ్రూపులుగా విభజించామని, ఆస్తమా ఉన్న వారిని చికిత్స తీసుకుంటున్న, చికిత్స తీసుకోని అని రెండు వర్గాలుగా విభజించి వారిని ప్రశ్నించామని తెలిపారు. ఈ పరిశోధనలో ఆస్తమా లేకుండా ఆరోగ్యవంతంగా ఉండే మహిళలతో పోల్చుకుంటే ఆస్తమాతో బాధపడే మహిళలు గర్భధారణ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తున్నట్టు తేలిందని నిపుణులు చెబుతున్నారు.