: కాఫీ తాగితే మంచిదేనట...


'నాకు కాఫీ, టీ వంటి అలవాట్లేమీ లేవండీ' అని చాలామంది గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ కాఫీ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని, రోజుకు కనీసం మూడు కప్పులకు మించకుండా కాఫీ తాగితే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు ఒకవైపు చెబుతున్నారు. అలాగే కాఫీ తాగితే షుగరు వ్యాధికి కూడా చెక్‌ చెప్పవచ్చట. రోజుకు మూడు నుండి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల షుగరు రాకుండా నివారించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ద ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ కాఫీ (ఐఎస్‌ఐసీ) నిర్వహించిన తాజా పరిశోధనల ప్రకారం రోజుకు మూడు నాలుగు కప్పుల కాఫీ తాగితే టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ముప్పు 25శాతం తగ్గుతుందని తేలింది. నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఐఎస్‌ఐసీ సంస్థ ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. కాఫీ అస్సలు తాగని వారు లేదా రోజుకు రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగేవారితో పోల్చుకుంటే రోజుకు రెండు మూడు కప్పుల కాఫీని లాగించేసే వారికి షుగరు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు... మనం మూడు కప్పులకన్నా అదనంగా తీసుకునే ప్రతి కప్పు కాఫీకి టైప్‌-2 మధుమేహం ముప్పు 7 నుండి 8 శాతం మేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చక్కగా కాఫీ లాగించేయండి!

  • Loading...

More Telugu News