: గిరిజన భాషలో రవీంద్రుని 'గీతాంజలి'


రవీంద్రనాధ్ ఠాగోర్ కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన 'గీతాంజలి' కావ్యం ఇప్పడు చక్మా గిరిజన భాషలో వెలువడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని చిట్టగాంగ్ అడవుల్లో ఈ గిరిజన తెగ ఎక్కువగా ఉంటుంది. గీతాంజలిలోని 157 కవితలను చక్మా భాషలోకి అనువదించి ప్రచురించినట్టు శ్రోత్ ప్రచురణ సంస్థ ప్రకటించింది. ఠాగోర్ నోబెల్ బహుమతి సాధించి వందేళ్లయిన సందర్భంగా అగర్తలాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఈ పుస్తకాన్ని విడుదల చేయగా, ప్రముఖ రచయిత తిమిర్ బరన్ చక్మా దీన్ని అనువదించారు.

  • Loading...

More Telugu News