: టాటాస్టీల్ లో పేలుడు.. 9 మందికి గాయాలు


జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ కర్మాగారంలో గ్యాస్ హాల్డర్ పేలి 9 మందికి గాయాలయ్యాయి. పేలుడు కారణంగా అగ్నిప్రమాదం తలెత్తడంతో ఆరు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. గాయపడిన వారిలో ముగ్గురికి ప్రాధమిక చికిత్స చేసి ఇంటికి పంపగా, మరో ఆరుగురు టాటా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News