: సినిమాల కంటే చదువే ముఖ్యం: రణభీర్ కపూర్
సినిమాలకి నిష్పాక్షిక ప్రేక్షకులు బాలలేనని ప్రముఖ బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్ అన్నారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మంచి సినిమాను గుర్తించడంలో బాలలే అత్యుత్తమ న్యాయనిర్ణేతలని అభిప్రాయపడ్డారు. కార్టూన్ నెట్ వర్క్ ఛానెళ్లతో పాటు సినిమాలు కూడా బాలలకు ముఖ్యమేనన్నారు. అయితే బాల్యంలో ఇతర వ్యాపకాలన్నింటి కంటే చదువే సర్వస్వం కావాలని ఆయన సూచించారు.