: 'బ్రేకింగ్ న్యూస్' సంప్రదాయం విడనాడండి: మీడియాకు ఏకే ఆంటోనీ హితవు


మీడియాలో 'బ్రేకింగ్ న్యూస్' సంప్రదాయాన్ని విడనాడాలని కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు టీవీఆర్ షెనాయ్ తన వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంటోనీ మీడియా ధోరణులపై మాట్లాడారు.

పోటీదారులను అధిగమించాలన్న ఆతృతలో జర్నలిస్టులు తమ విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆంటోనీ అభిప్రాయపడ్డారు. తమకు అందిన సమాచారం పట్ల మీడియా విచక్షణ పాటించాలని, తద్వారా 'బ్రేకింగ్ న్యూస్' విధానానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ కూడా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News