: 'రామ్ లీలా' విడుదలకు తొలగిన అడ్డంకులు


సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'రామ్ లీలా' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆర్ఎం అజీమ్ తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం తమ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ లభించిందన్నారు. దీనికితోడు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ... 'ప్రభు సమాజ్ ధార్మిక్ రామ్ లీలా కమిటీ' దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ సినిమా నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అజీమ్ తెలిపారు.

  • Loading...

More Telugu News