: ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం ఓఎస్డీగా కోయ ప్రవీణ్, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా భాస్కర్ భూషణ్, నల్గొండ అదనపు ఎస్పీగా రామరాజేశ్వరి, వరంగల్ గ్రామీణ అదనపు ఎస్పీగా అంబర్ కిషోర్ ఝా నియమితులయ్యారు. మరో ముగ్గురు ఐపీఎస్ లు డీవీ శ్రీనివాసరావు, వి.భాస్కరరావు, వై.సాయిశేఖర్ లకు పోస్టింగ్ లు ఇంకా ఖరారు కాలేదు.