: బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయిన సెహ్వాగ్, భజ్జీ, జహీర్


సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. 2013-14 కాంట్రాక్టు జాబితా నుంచి వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ పేర్లను తొలగించింది. కాగా, రిటైర్మెంట్ ప్రకటించి చివరి టెస్టు ఆడుతున్న సచిన్ పేరును మాత్రం అలానే ఉంచింది. ఏ, బీ, సీ కేటగిరీతో బీసీసీఐ కాంట్రాక్టు జాబితా రూపొందించింది. 'ఏ' జాబితాలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు ఏడాదికి కోటి రూపాయలు ఫీజుగా పొందుతాడు. బీ, సీ జాబితాలో ఉన్నవారు వరుసగా రూ.50 లక్షలు, రూ.25 లక్షలు ఫీజుగా పొందుతారు.

  • Loading...

More Telugu News