: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై
నీతి, నిజాయతీకి మారుపేరుగా నిలవాల్సిన ఓ ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై ప్రదీప్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో హోంగార్డు ద్వారా రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.