: రెండో వికెట్ కోల్పోయిన భారత్... బ్యాటింగ్ కు దిగిన సచిన్
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 77 పరుగుల వద్ద రెండో వికెట్ ను కూడా కోల్పోయింది. 43 పరుగులు చేసిన మురళీ విజయ్ షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో స్యామీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన 200వ టెస్టు మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగాడు. సచిన్ రాకతో స్టేడియం కేరింతలతో మారుమోగుతోంది.