: చెలరేగుతున్న భారత ఓపెనర్లు... భారత్ 50/0
విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను భారత్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు శిఖర్ ధవన్, మరళి విజయ్ లు విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో, 10 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. మురళి 33 (43 బంతులు, 7 ఫోర్లు), ధావన్ 18 (17 బంతులు, 4 ఫోర్లు)లు బౌండరీల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. అంతకు ముందు వెస్టిండీస్ 182 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.