: సీఎంను శిశుపాలుడితో పోల్చిన పాల్వాయి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శిశుపాలుడితో పోల్చారు. కిరణ్ శిశుపాలుడి కంటే ఎక్కువ తప్పులు చేశారన్నారు. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. మంత్రివర్గం అనుమతి లేకుండా జీవోఎంకు సీఎం నివేదిక ఎలా పంపుతారని ప్రశ్నించారు.