: గూగుల్ ఫర్ డూడుల్ లోగో విజేత గాయత్రి కేతురామన్


బాలల దినోత్సవం సందర్భంగా డూడుల్ ఫర్ గూగుల్ ఇండియా సైట్ హోం పేజ్ లోగో కోసం నిర్వహించిన పోటీల్లో పదవ తరగతి విద్యార్థిని గాయత్రి కేతురామన్ విజేతగా నిలించింది. ప్రముఖుల జయంతి, వర్ధంతుల సందర్భంగా గూగుల్ డూడుల్ లోగోను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో తుది జాబితాలో 12 మంది చోటు సంపాదించగా, చివరకు విజేతగా పూణేలోని బిషప్ కోఎడ్యుకేషన్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న గాయత్రి కేతురామన్ నిలిచింది.

ఆమె చిత్రీకరించిన 'భారతీయ మహిళలకు ఆకాశమే హద్దు' అనే లోగోను ఈ బహుమతి వరించింది. ఇందులో థీమ్ వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు భారతీయ మహిళ దూసుకుపోతున్న తీరును గూగుల్ గుర్తించింది. ఆమె రూపుదిద్దిన లోగోలో ప్రతి అక్షరం భారతీయ మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని గూగుల్ సంస్థ కొనియాడింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గాయత్రి ఈ అవార్డు అందుకుంది. బహుమతి కింద ఆమెకు స్కాలర్ షిప్ లభించనుంది.

  • Loading...

More Telugu News