: సత్తా చాటిన ఓజా.. విండీస్ 182...ఆలౌట్
భారత బౌలర్లు సత్తాచూపారు. సచిన్ కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు టీమిండియా బౌలర్లు రంగం సిద్ధం చేశారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ కేవలం 182 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు తొలి రోజు రెండో సెషన్లోనే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టును స్పిన్నర్లు కట్టడి చేశారు. ధాటిగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కు గేల్ ను అవుట్ చేసి షమి షాకిచ్చాడు.
తరువాత వికెట్ల వేటను ప్రారంభించిన అశ్విన్, ఓజాలు విండీస్ బ్యాట్సమన్ ను ముప్పతిప్పలు పెట్టారు. చెలరేగిన ఓజా ఐదు వికెట్ల ఫీట్ సాధించగా, అతనికి చక్కని సహకారమందించిన అశ్విన్ మూడు వికెట్లు తీసుకుని రాణించాడు. విండీస్ బ్యాట్స్ మెన్ లో పావెల్(48) ఒక్కడే కాస్త రాణించాడు. ఓజా బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియని ముగ్గురు టెయిలెండర్లు డకౌట్ గా వెనుదిరిగారు. దీంతో వెస్టిండీస్ జట్టు కేవలం 55.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో ఓజా 5 వికెట్లు తీసుకోగా, అశ్విన్ 3 వికెట్లు తీసి రాణించాడు. భువనేశ్వర్ కుమార్, షమి చెరో వికెట్ తీశారు. విండీస్ బ్యాట్స్ మెన్ లో గేల్(11), పావెల్(48), బ్రావో( 29), శామ్యూల్స్(19), చందరపాల్(25), నారాయన్(21), స్యామీ, షిల్లింగ్, ఫోర్డ్ లు డక్ అవుట్ అయ్యారు. రామ్ దిన్(12)నాటౌట్ గా నిలిచాడు.