: యూపీ డీఎస్పీ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం


సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ డీఎస్పీ జియా ఉల్ హక్, మరో ఇద్దరి హత్య కేసులో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ఈరోజు దర్యాప్తు ప్రారంభించింది. బుధవారమే దీనికి సంబంధించి యూపీ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి లేఖ అందిందని, దర్యాప్తు చేయాలంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆమోదం లభించిందని ఓ అధికారి తెలిపారు.

కాగా, ప్రత్యేక అధికారుల బృందం ఈ కేసుకు సంబంధించి వివరాలున్న వార్తా పత్రికలను, వీడియో క్లిప్పింగ్స్ ను సేకరించింది. ఈ ఘటనలో అనుమానితులపై సీబీఐ దర్యాప్తు చేయాలని రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కోరారు. మరోవైపు డీఎస్పీ భార్య..  మంత్రి  రాజాభయ్యాపై విచారణ జరపాలంటూ కేసు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. 

  • Loading...

More Telugu News