: జైపాల్ రెడ్డి లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన వీరవనిత అంటూ నిన్నటి నిర్మల్ కాంగ్రెస్ కృతజ్ఞతా సభలో సోనియాను కీర్తించిన జైపాల్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని, ఉద్యమంలో ఏనాడు మాట్లాడని జైపాల్ ఇప్పుడు ప్రకటన వచ్చాక సభలు పెట్టి సోనియాకు భజన చేయడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. వెయ్యి మంది తెలంగాణ యువకులను బలిదానం తీసుకుంది సోనియాగాంధీయేనని, అందువల్ల వెయ్యి మంది సమాధుల మధ్య అమెకు గుడి కట్టండన్నారు. సోనియాకు 'బలి దేవత' అనే బిరుదు ఇస్తే సరిపోతుందని రేవంత్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమవుతోందన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని... ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.