: సచిన్ ఆటను వీక్షిస్తున్న ఆయన తల్లి
సొంత గడ్డపై చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న సచిన్ ఆటను తొలిసారి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆయన తల్లి రజిని టెండూల్కర్ వాంఖడే స్టేడియానికి విచ్చేశారు. చివరిసారి సచిన్ ఆటను తిలకించేందుకు క్రికెట్ దిగ్గజాలు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో ముంబైలోని వాంఖడే స్టేడియం నిండిపోయింది.