: మూడో వికెట్ కోల్పోయిన విండీస్
భారత్ తో జరగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు విండీస్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలిరోజు రెండో సెషన్ ఆరంభంలోనే విండీస్ కు మరో దెబ్బతగిలింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ పావెల్ ను ఓఝా ఔట్ చేశాడు. 93 పరుగులతో లంచ్ కు వెళ్లిన విండీస్ మరో నాలుగు పరుగులు జత చేసి వికెట్ చేజార్చుకుంది. దీంతో శామ్యూల్స్ కి జతగా చందర్ పాల్ క్రీజులోకి వచ్చాడు. విండీస్ 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ, అశ్విన్, ఓఝా తలో వికెట్ తీశారు.