: లంచ్ సమయానికి విండీస్ స్కోర్ 93/2


వాంఖడే స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తుది సమరంలో వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో బ్రావో(29) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు షమీ బౌలింగ్ లో క్రిస్ గేల్ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో తొలి రోజు లంచ్ విరామ సమయానికి విండీస్ 28 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ అనుకున్నట్టుగానే ఆధిక్యం ప్రదర్శించింది. చక్కని ఫీల్డింగ్ మోహరింపుతో టీమిండియా విండీస్ ను అడ్డుకుంది. షమి తొలి వికెట్ తీసి శుభారంభం ఇస్తే దానికి కొనసాగింపుగా అశ్విన్ మరో వికెట్ తీసి... సచిన్ కు ఘన వీడ్కోలు పలికేందుకు బాటలు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News