: సీబీఐని అధైర్యపరిచే విధంగా ప్రధాని మాటలు: వెంకయ్యనాయుడు
ఇటీవల సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాని, ఆర్ధికమంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఖండించారు. సీబీఐ అధికారులను అధైర్యపరిచే విధంగా వారిరువురు మాట్లాడారని అన్నారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ఎప్పటిలానే యూపీఏ కుంభకోణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఎదుర్కోని కుంభకోణాలను యూపీఏ ఎదుర్కొందని... యూపీఏ కుంభకోణాలన్నీ కాగ్, మీడియా, కోర్టులు వెలికితీసినవేనన్నారు. నాలుగు పక్కల నుంచి వస్తున్న విమర్శలతో యూపీఏ అయోమయంలో పడిందని వెంకయ్యనాయుడు తెలిపారు. రాష్ట్ర విభజనపై మంత్రులందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.