: లంక నేవీ కాల్పుల్లో భారత జాలర్లకు గాయాలు


శ్రీలంక నేవీ మరోసారి భారత జాలర్ల పట్ల కఠినంగా వ్యవహరించింది. రామేశ్వరం తీరానికి 200 కిమీ దూరంలోని కొడియకారై వద్ద సముద్రంలో చేపలు పడుతున్న భారత మత్స్యకారులపై కాల్పులు జరిపింది. దీంతో, ఓ మత్స్యకారుడికి భుజంపై తీవ్రగాయం అయింది.

ఈ జాలర్లు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి చెందిన వాళ్లని తమిళనాడు మత్స్య శాఖ వెల్లడించింది. కాగా, గతవారం కూడా లంక దళాలు కొందరు భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి విడుదలకై తగిన చర్యలు తీసుకుంటున్నట్టు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న వెల్లడించారు. 

  • Loading...

More Telugu News