: చిత్తూరు జిల్లాలో నేటినుంచి నారా లోకేష్ పర్యటన
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తండ్రి పాదయాత్రలో ఉండడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడం, సొంత జిల్లాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో లోకేష్ జిల్లాలో పర్యటన చేపట్టారు.
చిత్తూరులో పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, నేతల మధ్య మనస్పర్థలు, ఇంకా పలు విషయాలపై ఈ నెల 10 వరకు జరిగే తన పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అంతకుముందు చాలాసార్లు లోకేష్ చిత్తూరు వచ్చినప్పటికీ పార్టీకి సంబంధించిన ఎలాంటి అంశాలను ప్రస్తావించకుండానే వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు కేవలం రాజకీయ కార్యక్రమాల్లోనే పాల్గొని పార్టీని బలోపేతం చేసే దిశగా తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
చిత్తూరులో పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, నేతల మధ్య మనస్పర్థలు, ఇంకా పలు విషయాలపై ఈ నెల 10 వరకు జరిగే తన పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అంతకుముందు చాలాసార్లు లోకేష్ చిత్తూరు వచ్చినప్పటికీ పార్టీకి సంబంధించిన ఎలాంటి అంశాలను ప్రస్తావించకుండానే వెళ్లిపోయా