: ఇవన్నీ షుగరును కంట్రోల్‌ చేస్తాయి


షుగరు వ్యాధిగ్రస్తులు మందులతోబాటు ఆహారంలో కొన్ని మార్పులను, చేర్పులను చేసుకుంటే షుగరును అదుపులో ఉంచుకోవచ్చు. సాధారణంగా షుగరు వ్యాధి ఉందని తేలగానే చాలామంది దిగాలు పడిపోతారు. తమకేదో పెద్ద రోగమొచ్చిందని బాధపడిపోతుంటారు. దీన్ని అదుపులో ఉంచడానికి ఇప్పుడు చాలా రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు మన ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువుల వాడకాన్ని ఎక్కువ చేసుకుంటే కూడా షుగరును అదుపులో ఉంచవచ్చు.

రోజూ వైద్యుని సలహామేరకు తగు వ్యాయామం చేస్తూ కొన్ని రకాల మసాలా దినుసులను వాడడం వల్ల షుగరును అదుపులో ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. దీన్ని ఎక్కువగా వంటకాల్లో వాడతాం. షుగరు రోగులు దీన్ని ఎక్కువగా వాడడం వల్ల వారికి మరింత ఉపయోగకరం. దీనికి బ్లడ్‌షుగర్‌ను కంట్రోల్‌ చేసే శక్తివుంది. ఇందులోని యాంటీ మైక్రోబైల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణశక్తికి చక్కగా తోడ్పడతాయి. పంటినొప్పి నుండి ఉపశమనాన్ని కలిగించే సుగుణం కూడా దాల్చిన చెక్కకుంది. అలాగే రోజూ మనం పోపులో భాగంగా వాడే ఆవాలు కూడా షుగరు రోగులకు మేలు చేస్తాయి. ఆవాలు బ్లడ్‌షుగరు పడిపోకుండా కాపాడుతాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఆవాలు చక్కగా ఉపకరిస్తాయట. ఇవి వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయి.

మన పోపుల డబ్బాలో యాంటీ బయాటిక్‌గా చెప్పుకునే పసుపులో ఉన్న ఔషధగుణాలు బోలెడు. షుగరు రోగులకు పసుపు చక్కగా పనికొస్తుంది. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే చోదకశక్తిగా పసుపు పనిచేస్తుంది. షుగరు వ్యాధితో యుద్ధం చేసే లక్షణం పసుపుకుంది. అలాగే మిరియాలు కూడా షుగరును అదుపులో ఉంచుతాయి. రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అయ్యేందుకు మిరియాలు దోహదం చేస్తాయి. బలహీనంగా ఉన్న నరాలను ఇవి ఉత్తేజితం చేస్తాయి. పచ్చిమిరపకాయలను వాడడం వల్ల జలుబు చేయదు, అంతేకాదు షుగరు రోగులకు నరాల బాధలను పచ్చిమిర్చి తగ్గిస్తుందట. ఇలా మనం వాడే దినుసుల్లో బోలెడు ఔషధ గుణాలున్నాయి. అయినా ఏవైనా కూడా మోతాదుకు మించి తీసుకోకుంటే అన్నీ మేలు చేసేవే!

  • Loading...

More Telugu News