: ఆ క్రికెటర్లు తాగనేల.. క్షమాపణ చెప్పనేల..!


మైదానంలో ఒత్తిడిని మద్యంతో చిత్తు చేద్దామని భావించారో ఏమో.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ, యువ స్పిన్నర్ జీతన్ పటేల్ ఇద్దరూ ఇంగ్లండ్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ సందర్భంగా బాగా తాగారట. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత తన సీనియర్ వెటోరీకి 'ఛీర్స్'చెప్పిన కాసేటికే పటేల్ కి నిషా తలకెక్కి కింద పడడంతో తలకు గాయమైంది.

దీంతో తరువాత రోజు అతను మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకే పరిమితమయ్యాడు. ఈ విషయాన్నిన్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. కిక్కు దిగిన తర్వాత తత్వం బోధపడడంతో వెటోరీ వెంటనే బోర్డుకు క్షమాపణ చెప్పాడు.

అసలు పటేల్ ను బార్ కు తీసుకెళ్లకుండా ఉండాల్సింది అని ఇప్పుడు తీవ్రంగా చింతిస్తున్నాడు. ప్రస్తుతం పటేల్ న్యూజిలాండ్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన వెటోరీ కాలి మడమ గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. 

  • Loading...

More Telugu News