: అప్పుడైనా ఇప్పుడైనా అదే పెద్ద భవనం


ఒకప్పుడు దేశంలోనే ఎత్తైన భవనంగా నిలిచిన అమెరికాలోని డబ్ల్యూటీసీ భవంతి అల్‌ఖైదా దాడిలో కుప్పకూలిపోయింది. ఇది అమెరికాను తేరుకోలేని దెబ్బ కొట్టినట్టు అల్‌ఖైదా భావించింది. అయితే కూలిన భవంతి స్థానంలోనే మరో ఎత్తైన భవంతిని అమెరికా నిర్మించింది. ఇప్పుడు కూడా ఇదే ఆ దేశంలోనే అతి ఎత్తైన భవనంగా నిలుస్తోంది.

వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌గా అమెరికా నిర్మిస్తున్న భవనం ఆ దేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలవనుంది. అల్‌ఖైదా దాడిలో డబ్ల్యుటీసీ టవర్లు కూలిన తర్వాత చికాగోలోని సియర్స్‌ టవర్‌ ఎత్తైన నిర్మాణంగా ఉంది. ఇప్పుడు పాత భవనం స్థానంలోనే కొత్తగా నిర్మిస్తున్న డబ్ల్యూటీసీ భవనంపై 124.4 మీటర్లు (408 అడుగులు) ఎత్తుగా ఉండే యాంటెనాను శాశ్వతంగా నిర్మించాలని ఆర్కిటెక్ట్ లు నిర్ణయించడంతో అమెరికాలో అదే ఎత్తయిన భవనంగా టాల్‌ బిల్డింగ్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఇప్పటికే 417 మీటర్లు (1368 అడుగులు) ఎత్తుండే ఈ భవనం యాంటెనాతో కలిపి 1776 అడుగుల ఎత్తుకు చేరనుంది.

  • Loading...

More Telugu News