: భార్యకోసం సాహసం
భార్యకోసం భర్తలు ఏం చేస్తారు... ఆమెకు ఇష్టమైన పనులను చేసి పెడతారు. అడిగినవి కొనిపెడతారు. ఇలా ఏవేవో చెప్పవచ్చు. కానీ మరణించిన భార్యకోసం, ఆమెకు వైద్యం చేసిన ఆసుపత్రికి నిధులను సమకూర్చడంకోసం పదివేల అడుగుల ఎత్తునుండి కిందికి దూకుతారా ఎవరైనా... ఒక వ్యక్తి అలాంటి సాహసం చేశాడు. అయినా ఇందులో అంత గొప్ప ఏంటో అనుకుంటున్నారా... అతను 93 ఏళ్ల వృద్ధుడు, ఇప్పటికే మూడుసార్లు గుండెకు సంబంధించి ఆపరేషన్లు చేయించుకుని ఉన్నాడు. అదీ అక్కడ గొప్పతనం.
బ్రిటన్‌కు చెందిన జాక్‌హాక్ పదివేల అడుగుల ఎత్తునుండి విజయవంతంగా స్కైడైవింగ్ చేశాడు. జాక్ భార్య ఇటీవలే మరణించింది. ఆమెకు చివరి దశలో చికిత్సను చేసిన ఆసుపత్రికి నిధులను సమకూర్చేందుకు జాక్ ఈ సాహసానికి పూనుకున్నాడు. 93 ఏళ్ల జాక్‌కు ఇప్పటికే మూడుసార్లు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు జరిగాయి. అంత వృద్ధుడు, అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఇలాంటి సాహసానికి పూనుకున్నాడు. ఈ సాహసం ద్వారా ఆసుపత్రికి వెయ్యి పౌండ్ల వరకూ నిధులు సమకూరాయి.