: ఆ'రేంజ్' వజ్రం కాబట్టే అంత ధర!
వజ్రాలు స్వచ్ఛంగా తెల్లగా మెరిసిపోయేవి కొన్ని ఉంటే, గులాబీ రంగులో కాంతులీనే వజ్రాలు మరికొన్ని ఉంటాయి. ఆరెంజ్ రంగులో ఉండే వజ్రాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అతిపెద్ద వజ్రాన్ని వేలం వేయగా ఎక్కువ మొత్తాన్ని చెల్లించి వజ్రాలపై మక్కువ ఉండేవారు దాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రపంచంలోనే అదిపెద్ద వజ్రంగా చెప్పుకునే ఆరెంజ్ వజ్రం చాలా అపురూపమైందని చెబుతున్నారు. ఈ వజ్రం ఎంత పెద్దది అంటే 14.82 కేరట్లుంది. దీన్ని బుధవారం నాడు క్రిస్టీ జ్యూవెల్స్ సంస్థ వేలం వేయగా రికార్డు స్థాయిలో దీని ధర పలికింది. 35.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 228.6 కోట్ల రూపాయలకు ఇది అమ్ముడుపోయిందట. ఒక వజ్రానికి ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని క్రీస్టీ సంస్థ చెబుతోంది. ఇలాంటి వజ్రాలను ఫైర్ డైమండ్స్‌గా పిలుస్తారు. 1882లో ఎడ్విన్ స్ట్రీటర్ అనే రచయిత ఇలాంటి వజ్రాలు ప్రకృతిలోను, ప్రపంచంలోనూ అద్భుతమైన వజ్రాలని ప్రశంసించారు కూడా. ఇలాంటి అరుదైన వజ్రం దక్షిణాఫ్రికాలో లభించింది.