: క్రీడల్లో అక్రమాల నిరోధానికి కొత్త చట్టం
క్రీడల్లో అక్రమాల నిరోధానికి కేంద్రం కొత్త చట్టాన్ని తెచ్చే యోచనలో ఉంది. క్రీడల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించే యోచనలో ఉన్నారు. క్రీడా అక్రమాల నిరోధక బిల్లు-2013 ముసాయిదాపై కేంద్ర క్రీడా శాఖ ప్రజాభిప్రాయాలు కోరుతోంది. ప్రజాభిప్రాయాలు పంపడానికి డిసెంబర్ 3 గడువు.