: నేడు ఢిల్లీకీ బొత్స.. రేపు ముఖ్యమంత్రి పయనం!


ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లపై అధిష్ఠానంతో చర్చించి ఖరారు చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో చర్చించి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసుకుని వస్తారు.

అనంతరం ఈ నెల 9న లేదా 10న ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటిస్తారు.అయితే సీఎం పర్యటన ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీలును బట్టి ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గానీ హస్తినకు వెళతారని పార్టీవర్గాల సమాచారం. 

  • Loading...

More Telugu News