: బాంబు దాడి నుంచి తప్పించుకున్న ప్రచండ
నేపాల్ మావోయిస్టు నేత ప్రచండ ఈ రోజు బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీలో పాల్గొనడానికి యూసీపీఎన్ మావోయిస్టు చైర్మన్ ప్రచండ బెలౌరీ వెళ్తుండగా రోడ్డు ప్రక్కన బాంబు పేలింది. ప్రచండ హాజరు కావాల్సిన ఎన్నికల సభ ప్రాంగణంలోనూ బాంబులు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.