: ఎవరికో భయపడి రచ్చబండ వాయిదా వేయలేదు: ముఖ్యమంత్రి కిరణ్
పేద ప్రజలకు సేవలందించడంలో ముందుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి రచ్చబండలో త్వరలో తాను పాల్గొంటానని అన్నారు. క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు సర్పంచ్ లక్ష్మారెడ్డి నేతృత్వంలో వందమంది గ్రామస్తులు తమ గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తమ గ్రామంలోని రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేయడం పట్ల వారు విచారం వ్యక్తం చేయగా, గ్రామానికి తప్పకుండా వస్తానని, గ్రామ సంక్షేమానికి అన్ని చర్యలు చేపడతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంత్రుల విజ్ఞప్తి మేరకు తాను వాయిదా వేశానే తప్ప ఎవరికో భయపడి కాదని సీఎం స్పష్టం చేశారు.