: సచిన్ క్రికెట్ కు నిజమైన దౌత్యవేత్త: షాన్ పొలాక్


సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు నిజమైన దౌత్యవేత్త అని షాన్ పొలాక్ కొనియాడారు. రాయబారి అంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాన్ని ప్రతిబింబించే వ్యక్తి అని, క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని గౌరవించేలా చేసిన సచిన్ అంతటి గొప్పవ్యక్తి అని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ అన్నారు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్ కి సేవలందించిన సచిన్ 200వ టెస్టు మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటించడం బాధ కలిగించినా సచిన్ హుందాగా తప్పుకుంటున్నారని పొలాక్ పేర్కొన్నారు. ఆడగలిగి ఉండి కూడా సచిన్ నిర్ణయం తీసుకోవడం అతని గొప్పతనాన్ని సూచిస్తుందని ఆల్ రౌండర్ పొలాక్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News