: మహారాష్ట్రలో మూడు కొత్త విమానాశ్రయాలు
మహారాష్ట్రలో మూడు కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రధాని కార్యాలయం పచ్చజెండా వూపింది. ఈ మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వి రాజ్ చౌహాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నవీ ముంబై, పూణె, నాగ్ పూర్ లలో కొత్త విమానాశ్రయాలు మంజూరు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. తాజా నిర్ణయంతో మౌలిక నిర్మాణ రంగంలో ముందుకు వెళ్లడానికి కేంద్రం సుముఖంగా ఉందని ప్రధాని పరోక్షంగా వెల్లడించారు.