: విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు: చిరంజీవి
రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రకు ప్యాకేజీలు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రాజమండ్రిలో హవ్ లాక్ బ్రిడ్జిని ఈ రోజు చిరంజీవి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హవ్ లాక్ బ్రిడ్జిని టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతేగాక గోదావరి తీరంలో ప్రత్యేక పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.