: ఏకాభిప్రాయం లేకుండా ఎలా విడదీస్తారు?: మండలి బుద్ధ ప్రసాద్
కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడ వల్ల ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందని అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విభజనపై మాట్లాడుతూ ఏకాభిప్రాయం లేకుండా విభజన ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ విలీనం అయినప్పుడు వర్తించిన విధానాలు విభజనకు వర్తించవా? అని ఆయన నిలదీశారు.