: చైనా ఓపెన్ లో రెండో రౌండ్లో అడుగుపెట్టిన సైనా, పారుపల్లి కష్యప్
చైనా సూపర్ సిరీస్ లో ఇండియన్ షట్లర్లు బోణీ కొట్టారు. ఆరో సీడ్ సైనా నెహ్వాల్ జపాన్ కు చెందిన నొజోమీ ఒకుహరాపై 21-14, 21-19 తేడాతో గెలుపొందింది. మరో వైపు ప్రపంచ 12వ ర్యాంకు ఆటగాడు పారుపల్లి కష్యప్ ఎనిమిదో ర్యాంకు థాయ్ ఆటగాడు పొన్సానాపై 22-20, 21-15 తేడాతో గెలుపొందాడు.