: కైకలూరులో నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం


'వస్తున్నా.. మీకోసం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర ఈ రోజు కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో కొనసాగనుంది. యాత్ర మధ్యలో నేడు దాకరం వద్ద పార్టీ శాసనసభపక్ష సభ్యులతో బాబు సమావేశమవుతారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహం, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు, తదితర అంశాలపై సభ్యులతో అధినేత చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News