: సచిన్ ను అభిమానులు తొందరగానే మరచిపోతారు : జావెద్ మియాందాద్
మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ ను అభిమానులు తొందరగానే మరచిపోతారని పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ అభిప్రాయపడ్డాడు. సచిన్ రిటైర్ అవుతున్న సమయంలో భారత జట్టులో యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారని... వీరంతా సచిన్ ను మరచిపోయేలా చేస్తారని అన్నాడు. ఏ క్రికెటరైనా ఎక్కువ సంవత్సరాలు క్రికెట్ ఆడితే... అతను తొందరగా ఫేడ్ అవుట్ అవుతాడని చెప్పాడు. దానికి ఉదాహరణ తానే అని చెప్పాడు.
2011లో ఇండియా వరల్డ్ కప్ గెలుపొందినప్పుడే సచిన్ రిటైర్ అయ్యుంటే బాగుండేదని మియాందాద్ తెలిపాడు. గత ఏడాది కాలంగా సచిన్ పై రిటైర్ కావాలంటూ ఒత్తిడి వచ్చిందని అన్నాడు. ప్రస్తుతం తన చివరి టెస్ట్ కు సిద్ధమైన సచిన్ కు భారీ స్థాయిలో సన్మాన కార్యక్రమాలు జరపడం... అతని స్థాయికి సరిపోయేవేనని కితాబిచ్చాడు. అయితే, భారత ఉపఖండంలో ప్రతి గొప్ప ఆటగాడిని కూడా సచిన్ స్థాయిలోనే సన్మానించాలని మియాందాద్ అభిప్రాయపడ్డాడు.