: ఎవరినీ సంప్రదించకుండానే సీఎం నివేదిక పంపారు : డీఎస్
సీఎం కిరణ్ ఎవరినీ సంప్రదించకుండానే జీవోఎంకి నివేదిక పంపడం శోచనీయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ కృతజ్ఞత సభలో డీఎస్ ప్రసంగించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే నాయకత్వం ఇక్కడ ఉందని తెలిపారు. తెలంగాణను సోనియానే ఇచ్చారని... ఇందులో మరెవరి ప్రమేయం లేదని అన్నారు. తెలంగాణలో బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.