: రాహుల్ కు ఎన్నికల సంఘం హెచ్చరిక
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. గతనెల ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన ఐఎస్ఐ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ ఇలా స్పందించింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ చేసిన వ్యాఖ్యలకు, లేఖలో వివరించిన విధానానికి ఎలాంటి సంబంధం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడం, ఆయన వివరణ ఇవ్వడం తెలిసిన సంగతే.