: ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు జట్టు ఎంపిక నేడే
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును ఈరోజు ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ ఆధ్వర్యంలో సెలెక్టర్లు నేడు ముంబయిలో సమావేశమవుతారు. తొలి రెండు టెస్టుల్లో జట్టు విజయాలు సంతృప్తికరంగానే ఉన్నా, ఓపెనర్ సెహ్వాగ్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
అతనిపై సెలెక్టర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ద్రావిడ్ లాంటి మాజీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ కు ఉద్వాసన పలికేందుకు సెలెక్టర్లు వెనుకాడకపోవచ్చు. ఓపెనర్ పాత్రలో విజయ్ చక్కగా రాణిస్తుండడంతో అతనికి జోడీగా మరో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని సెలక్టరు భావిస్తున్నారు.