: మహాబోధి దేవాలయానికి 300 కేజీల బంగారం
పాట్నాలోని బుద్ధగయ జిల్లాలో ఉన్న మహాబోధి దేవాలయానికి థాయ్ లాండ్ కు చెందిన బౌద్ధ భక్తులు 300 కేజీల బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారాన్ని డజను మంది కమెండోలు ఓ ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఈ బంగారంతో, పదిహేను వందల ఏళ్ల నాటి మహాబోధి ఆలయానికి బంగారం పూత పూయనున్నారు. ఇప్పటికే ఆలయానికి బంగారం తాపడం పనులు సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో మొదలయ్యాయని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని బుద్ధగయ దేవాలయ కార్యదర్శి ఎన్ డోర్జీ తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి నలభై నుంచి యాభై రోజులు పడుతుందని చెప్పారు.