: ప్రధాని, సోనియాలపై పోలీసులకు న్యాయవాదుల ఫిర్యాదు


ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, చిదంబరం, కావూరి సాంబశివరావు, జైపాల్ రెడ్డిలపై కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తూ రాష్ట్ర ప్రజల మధ్య వీరంతా చిచ్చు పెడుతున్నారని న్యాయవాదులు మల్లికార్జున, నాగన్నలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన సీఐ మాధవ్... న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News