: అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం
అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లకపోవడంపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమైక్యవాదో.. విభజనవాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యంగ విరుద్ధంగా ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలన్నారు. సమన్యాయం పేరుతో బాబు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నారని, ఢిల్లీలోనూ ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.