: సీఎం ఎదురు తిరుగుతున్నారు: నారాయణ
కేంద్రం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టినా సీఎం ఇంకా ఎదురు తిరుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం సవాలు చేయడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఆందోళనలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వమే, ప్రజలను భయపెడుతోందని ఆయన విమర్శించారు. జీవోఎంకు రాజకీయ పార్టీలతో విడివిడిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రెండు వాదనలు చేయడం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.